ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ఊపందుకున్న నామినేషన్లు

జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇంకా నాలుగు రోజులే గడువు ఉన్నందున.. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామ పత్రాలు దాఖలు చేస్తున్నారు.

ఎస్పీవై రెడ్డి

By

Published : Mar 21, 2019, 8:03 PM IST

కర్నూలులో ఊపందుకున్న నామినేషన్లు
కర్నూలు జిల్లా నంద్యాల లోక్​సభ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఎంపీ ఎస్పీవై రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికల్లో జనసేన సత్తా చూపిస్తామని ఎంపీ అన్నారు.

నందికొట్కూరులో వైకాపా అభ్యర్థి తోగురు ఆర్థర్ నామినేషన్ వేశారు. అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు.

శ్రీశైలం వైకాపా అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని.. జగన్ సీఎం కావడం తథ్యమని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఆదోనిలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీనాక్షి నాయుడు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నూర్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్​లు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

పత్తికొండ తెదేపా అభ్యర్థి కె.ఈ. శ్యాంబాబు నామినేషన్ వేశారు. తండ్రి ఉపముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి, బాబాయ్ ప్రతాప్​తో కలిసి వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు.

ఇవిచదవండి

నందికొట్కూరులో తెదేపా అభ్యర్థి ప్రచారం

ABOUT THE AUTHOR

...view details