ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ నుంచి స్పిరిట్... ఆంధ్రాలో నకిలీ మద్యం తయార్..! - నకిలీ మద్యం న్యూస్

కర్నూలు జిల్లా ఉడుముల పాడులో నకిలీ మద్యం తయారుచేస్తూ పట్టుబడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కర్ణాటక, తెలంగాణ నుంచి స్పిరిట్, మద్యం సీసా మూతలు కొనుగోలు చేసి నకిలీ మద్యం  తయారు చేస్తున్నారు. ఈ ముఠాలో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు తెలిపారు.

Illegal Liquor making gang arrested in kurnool
నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

By

Published : Jan 2, 2020, 6:16 AM IST

నకిలీ మద్యం ముఠా అరెస్టు ..వివరాలు తెలుపుతున్న పోలీసులు

నకిలీ మద్యం తయారుచేస్తున్న ముగ్గురు నిందితులను విజిలెన్స్‌ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. గత నెల 30న కర్నూలు జిల్లా డోన్‌ మండలం ఉడుముల పాడులో రాంబాబు అనే వ్యక్తి.. ఇంట్లో నకిలీ మద్యం తయారుచేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కారుతో పాటు స్పిరిట్‌... క్వాటర్‌ బాటీల్లు... మూతలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఎనిమిది లక్షలు ఉంటుందని డిప్యూటీ కమిషనర్‌ చెన్నకేశవులు తెలిపారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్టు చేయాలన్నారు. వీరికి కర్ణాటక, తెలంగాణ నుంచి స్పిరిట్‌, మూతలు సప్లై చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకుని నకిలీ మందును అరికడుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details