ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా స్తంభించిన వాహనాలు

శ్రీశైలం సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సందర్శకుల తాకిడి పెరిగి.. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్‌యార్డు వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో పోలీసులు, యాత్రికుల మధ్య పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు జరిగాయి.

Huge Traffic jam In Srisilam
శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా స్తంభించిన వాహనాలు

By

Published : Sep 21, 2020, 12:08 AM IST

శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్‌యార్డు వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం సందర్శకులు ఆనకట్టను చూసేందుకు వస్తుండటంతో అక్కడి నుంచి సున్నిపెంట వరకు వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. జలాశయం చూసేందుకు వచ్చిన వారు వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాలగట్టు ప్రాంతంలో చేపలను విక్రయిస్తుండటంతో యాత్రికులు వాహనాలను రోడ్లపై నిలిపి వాటిని కొనుగోలు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించే క్రమంలో పోలీసులు, యాత్రికుల మధ్య పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు జరిగాయి.

ఇదీ చదవండీ... హంస వాహనంపై...శ్రీవారి వైభవం

ABOUT THE AUTHOR

...view details