భారీ వర్షాలు ఆ వృద్ధ దంపతులకు ఆవేదన మిగిల్చాయి. కాస్తో కూస్తో ఉన్న గూడు కూలిపోవటంతో పాటు.. కుటుంబ పోషణకు ఆధారమైన గేదెలను గాయాల పాలుచేశాయి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలికి చెందిన వీరన్న దంపతులు.. రెండు గేదెలను పోషిస్తూ పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.
భారీ వర్షాలకు...వారు నివసించే మట్టి ఇల్లు కూలిపోవటంతో పాటు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఆసమయంలో వారు ఇంట్లో లేరు. తమ కుటుంబ పోషణకు ఆధారమైన గేదెలు గాయపడటంతో వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.