ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతిక దూరం మరిచారు.. మందు కోసం గుంపులుగా చేరారు - ఎమ్మిగనూరులో తెరుచుకున్న మద్యం షాపులు తాజా వార్తలు

అసలే రాష్ట్రంలోనే అధిక కరోనా కేసులు నమోదైన జిల్లా అది. ఇప్పుడు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వటంతో మందు బాబులు భౌతిక దూరం, మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గుంపులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రత అధికమవుతుందేమో అని కర్నూలు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

heavy rush at emmiganuru wine shops in kurnool district
భౌతికదూరం మరిచారు.. మందు కోసం గుంపులుగా చేరారు..

By

Published : May 4, 2020, 4:43 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మద్యం కోసం జనం ఎగబడ్డారు. దాదాపు నెలన్నర తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. భౌతిక దూరం మర్చిపోయి గుంపులు గుంపులుగా నిలుచున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని వరుసలో నిలుచోబెట్టేందుకు చెమటోడ్చారు.

ఇప్పటికే రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మద్యం దుకాణాలు తెరవటంతో వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతుందేమో అని జిల్లా ప్రజలు భయపడుతున్నారు. మందుబాబులను కట్టడి చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details