కర్నూలు జిల్లా ఆదోనిలో ఉదయం భారీ వర్షం కురిసింది. మునిసిపల్ మెయిన్ రోడ్, తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి జలమయం అయ్యాయి.
లంగర్ బావి వీధి ,కంచిగారి వీధి, గౌలి పేట్, పెద్ద మార్కెట్, రైతు బజార్ లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు నిలిచింది. 6 సెంటీ మీటర్లు వర్షం పడిందని రెవిన్యూ అధికారులు వెల్లడించారు.