పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు నవజీవన్ చెవిటి, మూగ పాఠశాల యాజమాన్యం ముందుకొచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ ఆధ్వర్యంలో కార్మికులకు సరకులు అందజేశారు. కమిషనర్ వారి దాతృత్వాన్ని అభినందించారు. పట్టణంలో క్లస్టర్ల వారిగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ కొనసాగిస్తామని పాఠశాల ఫాస్టర్ మరెడ్డి తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేత - కర్నూలులో కార్మికులకు నిత్యావసరాలు అందజేత
కరోనా వ్యాప్తి నివారణలో కీలక సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేత
TAGGED:
kurnool lockdown