కర్నూలు జిల్లా ఆదోని ఎస్కేడీ కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ రామలింగ.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి కిడ్నీ ఇచ్చేందుకు ఆయన అమ్మ సిద్ధంగా ఉన్నారు. కానీ... శస్త్ర చికిత్సకు 2 లక్షల రూపాయలు అవసరం అని బెంగళూరు వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని రామలింగ గురించి తెలుసుకున్న అతని స్నేహితులు.. ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చారు. ఆ మొత్తాన్ని సమకూర్చారు. వారంతా... 1992 బ్యాచ్ వైఎంకే పాఠశాలలో పదో తరగతి చదివారు.
కష్టంలో కదిలొచ్చిన స్నేహితులు
కర్నూలు జిల్లా ఆదోని ఎస్కేడీ కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ రామలింగ.. కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. 1992 వైఎంకీ పాఠశాలలోని పదో తరగతి బ్యాచ్‌కు చెందిన అతనికి.. మిత్రులు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
కిడ్నీ రోగికి మిత్రుల సాయం