కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని సాగర్ వీధివాసులు దాతృత్వం చాటారు. వీధిలోని వారంతా కలిసి ఆహార పొట్లాలు తయారుచేసి జాతీయ రహదారిపై వెళ్తున్న బాటసారులకు, వాహనాల డ్రైవర్లకు పంపిణీ చేశారు. కాలినడకన వెళ్తున్న వారికి, లారీ చోదకులకు ఆహారం అందించారు. వారు కడుపునిండా తిని... మనసారా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వీధంతా ఒక్కటయ్యారు... పేదలకు ఆహారం పంచారు - డ్రైవర్లకు ఆహారం పంచిన ఆళ్లగడ్డ వాసులు
కష్ట కాలంలో అంతా ఏకమయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పేద, ధనిక తేడా లేకుండా ఎవరికి వారు తోచిన సాయంతో ఆదుకుంటున్నారు. కలిసికట్టుగా సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు ఆ వీధి వాసులు.
లారీ డ్రైవర్లకు ఆహారం పంపిణీ