ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాంప్లెక్స్ ఎరువు కొంటేనే, యూరియా:రైతుల ఆందోళన - ఎమ్మిగనూరు

కర్నూలు ఎమ్మిగనూరులో బస్తా యూరియా కోసం, రైతులు సొసైటీల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగాల్సి వస్తోంది. పొలం పనులు మానుకుని ఎరువుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

farmers waiting for urea in emmiganuru at karnul district

By

Published : Sep 7, 2019, 11:45 AM IST

వారంరోజులనుండి బస్తా యూరియాకోసం పడిగాపులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూరియా కోసం రైతుల కుస్తీలు కొనసాగుతున్నాయి.బస్తా యూరియా కోసం వారం రోజులు పాటు వేచి చూడాల్సి వస్తోంది.సొసైటీలకు వచ్చిన యూరియాను తూతూ మంత్రంగా పంపిణీ చేసి,నల్ల బజారుకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.ఇది చాలక,ఎరువుల దుకాణాల్లో కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని షరతులతో గత్యంతరం లేక రెండు అధిక ధరలకు కొనాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details