కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబాన్ని పోలీసులతో పాటు వైకాపా నేతలూ వేధించారని మాజీ మంత్రి ఫరూఖ్ ఆరోపించారు. తూతూమంత్రంగా ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన మండిపడ్డారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఫరూఖ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను క్షమించేది లేదని స్పష్టం చేశారు.
నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య విచారకరమని చినరాజప్ప అన్నారు. అక్రమ కేసులకు నిదర్శనం సలాం కుటుంబం ఆత్మహత్యే అని వ్యాఖ్యానించారు. చేయని నేరాన్ని అంగీకరించాలని వేధించటంతో కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.