ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనెల 9న అమ్మఒడి పథకం ప్రారంభిస్తాం' - aadimulapu suresh in kurnool trip

'అమ్మఒడి' పథకం ద్వారా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపవచ్చని... మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా... మంత్రి సురేశ్ ఓ పాఠశాలను సందర్శించారు.

education minister in kurnool
9 నుంచే అమ్మఒడి

By

Published : Jan 4, 2020, 4:39 PM IST

9 నుంచే అమ్మఒడి

కర్నూలు జిల్లాలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పర్యటించారు. నగరంలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ... ఈ నెల 9న అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. పాఠశాలల్లో ఇక నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీఇచ్చారు. అమ్మఒడి పథకం ద్వారా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపవచ్చని వివరించారు. ఇంగ్లిషును ఒక మాధ్యమంగానే పెడుతున్నామని... తెలుగు భాషకు ఏ సమస్య ఉండదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details