కర్నూలు జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. వర్షాల కోసం పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో గాడిదలకు వివాహం(donkeys marrage) జరిపించారు. పంటలు ఎండిపోతున్నాయని.. సమృద్ధిగా కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం చేశారు. గాడిదలకు పెళ్లి చేస్తే సమృద్ధిగా వానలు కురుస్తాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పెళ్లి తంతును గ్రామస్థులు ఘనంగా జరిపించారు. గాడిదల కల్యాణం అనంతరం అన్నదానం చేయడం కొసమెరుపు.
వానలు కురవాలని వింత ఆచారం... ఎక్కడంటే..?
గతంలో వర్షాలు కురవాలని గ్రామస్థులు... మారుమూల పల్లెల్లో వింత వింత ఆచారాల్ని.. సంప్రదాయాల్ని పాటించేవారు. కుక్కలకు, కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు. సమృద్ధిగా వర్షాలు పడాలంటూ చెట్లకు కూడా వివాహాలు జరిపించేవారు. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి.
donkey marriage in karnulu district