ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ఉద్రిక్తత.. చంద్రబాబు గో బ్యాక్​ అంటూ న్యాయవాదుల నినాదాలు - తెదేపా కార్యకర్తలకు న్యాయవాదులకు మధ్య వివాదం

TDP Leaders and Lawyers: కర్నూలులో న్యాయవాదులకు, తేదేపా కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఉండగా.. నగరంలోని న్యాయవాదులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Dispute Between TDP Leaders and Lawyers
తెదేపా కార్యకర్తలకు న్యాయవాదులకు మధ్య వివాదం

By

Published : Nov 18, 2022, 5:01 PM IST

Dispute Between TDP Leaders and Lawyers: కర్నూలులో న్యాయవాదులకు, తెదేపా నాయకులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్​లో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న న్యాయవాదులు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ,చంద్రబాబు గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న కర్నూలు జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ మల్లెల రాజశేఖర్.. న్యాయవాదులను అడ్డుకున్నారు. అంతేకాకుండా తెదేపా కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదుల, తెదేపా కార్యకర్తల పరస్పర నినాదాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు న్యాయవాదులను అక్కడి నుంచి తరలించారు.

కర్నూలులో తెదేపా కార్యకర్తలకు, న్యాయవాదులకు మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details