కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వారం రోజుల్లో వరి కోసేందుకు రైతులు సిద్ధమవుతుండగా తుపాన్ విరుచుకుపడింది. పొలాల్లో వాననీరు నిలిచిపోయింది. కోయాల్సిన పైరు నేలకొరిగింది... ఇప్పటికే కోసి కుప్పలుగా పెట్టిన పంట పూర్తిగా తడిసిపోయింది. మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నంద్యాలలో వరి పైరులో నిలిచిన నీటిలో ధాన్యం తడిసిపోయింది. చేతికి అందివచ్చిన పంట ఇలా నీటిపాలవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో వరి, తదితర పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.