కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లెలో ఇరు వర్గాల మధ్య తగాదా ఐదున్నరకెరాల సజ్జ పంట నాశనానికి కారణమైంది. గ్రామానికి చెందిన భీమన్న, కేశన్న కుటుంబాలు కొన్నేళ్లుగా మన్యం భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈసారి సజ్జ పంట వేయగా.. అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు పంటను కోసి ట్రాక్టర్లో తరలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాము తెదేపా సానుభూతి పరులమని వైసీపీకి చెందినవారే తమ పంటను నాశనం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇరు వర్గాల తగాదా... ఐదున్నరకెరాల సజ్జ పంట వృథా - పంట నష్టం
ఓ వర్గానికి చెందిన సజ్జ పంటను మరో వర్గం వారు నాశనం చేసి ట్రాక్టర్లో తరలించిన ఘటన కర్నూలు జిల్లా పార్లపల్లెలో జరిగింది. తాము తెదేపాకు చెందిన వారమని వైసీపీ వర్గీయులే తమ పంటను తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు.
పంటను కోసి ట్రాక్టర్‌పై తరలిస్తున్న కూలీలు