కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గ్రామాల రైతుల నుంచి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తుంటారు. పత్తిని ఎలక్ట్రానిక్ త్రాసుపై తూకం వేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు రైతులను బురిడీ కొట్టించాలని ప్రయత్నించారు. త్రాసును ట్యాంపర్ చేసి... పత్తిని తక్కువ బరువుగా చూపించారు. తూకంలో వ్యత్యాసాన్ని గమనించిన కొంతమంది రైతులు... వ్యాపారస్థులను ప్రశ్నించగా వారు అక్కడినుంచి పారిపోయారు. దీనిపై అన్నదాతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
తూకంలో తేడా.. పత్తి వ్యాపారి మోసం - కర్నూలు రైతులను మోసం చేసిన వ్యాపారులు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓబులంపల్లెలో.. పత్తి రైతులను తూకం పేరుతో ఓ వ్యాపారి మోసం చేసే ప్రయత్నం చేశాడు. రైతులు అది గమనించి పట్టుకునేలోపే నిందితుడు పారిపోయాడు.
పత్తి వ్యాపారంలో మోసం