కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో ఓ కీలక అధికారితో పాటు కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిగతా సిబ్బందిలో ఆందోళన మొదలైంది. పలువురు ఉద్యోగులు సెలవుపై వెళ్ళారు. ఇప్పటికే కొంతమంది సెలవులో ఉన్నారు. కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో ఉద్యోగులకు పాజిటివ్ వస్తే పురపాలక సంఘం కార్యాలయం మూసివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
పురపాలక సంఘం కార్యాలయంలో కరోనా కలకలం - కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ఒక కీలక అధికారికి పాజిటివ్ రావటంతో సహోద్యోగులు అందోళన చెందుతున్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరిగితే కార్యాలయాన్ని మూసి వేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పురపాలక సంఘం కార్యాలయంలో కరోనా కలకలం