స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. తెదేపా, కాంగ్రెస్, ఇతర పార్టీల తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థులపై వైకాపా నేతలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేయాలి'
రాజ్యాంగబద్ధ సంస్థలకు, అందులో పనిచేస్తున్న అధికారులకు కులాలను ఆపాదించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సమయంలో వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత చింతా మోహన్