కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాలుగు రోజులుగా గ్రామానికి నీరు రాకపోవటంతో వైకాపా వర్గీయుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నీటి కుళాయి విషయంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. మూడు రోజులుగా గ్రామంలో నీరు రాకపోవటంతో స్థానిక నాయకుడు శేఖర్ వద్దకు వెళ్లి విషయం చెప్పారు. నీరు విడుదల చేశారు. గ్రామంలో తనమాటే చెల్లాలని నీరు విడుదల చేయటానికి నీవెవరూ అని భాస్కర్ అనే వ్యక్తి తన వర్గీయులతో కలిసి శేఖర్ వర్గీయులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో శేఖర్, రహెమాన్, మద్దిలేటికి గాయాలయ్యాయి. ఇరువర్గాల వారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనచురులే కావడం గమనార్హం.