ఇవీ చదవండి:
బంటుపల్లి ఘర్షణలో గాయపడ్డ భాజపా వర్గీయులను పరామర్శించిన మాదవ్ - బంటుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని బంటుపల్లి గ్రామంలో వైకాపా దాడిలో గాయపడిన భాజపా కార్యకర్తలను ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రశాంత వాతావరణం కనిపించడం లేదన్న ఆయన.. బాధితులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బంటుపల్లిలో ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన భాజపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ నేడు తారాస్థాయికి చేరుకుంది. గాయపడిన భాజపా వర్గీయులను పోలీసులు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైకాపా నాయకులు తమ ఇళ్ళను ధ్వంసం చేసి.. ఇంట్లో ఉన్న సామగ్రిని బీరువాలో ఉన్న డబ్బులను తీసుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైకాపా నాయకులు అమానుషంగా దాడులు చేస్తున్నారని వాపోయారు. కేవలం వైకాపా జెండాలు కట్టలేదని ఈ దాడులు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వైకాపా దాడిలో గాయపడిన బాధితులను భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అరాచకాలు చేయిస్తోందని ఎక్కడ చూసినా గొడవలు తప్ప ప్రశాంత వాతావరణం లేదని మండిపడ్డారు. బాధితులకు భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
Intro:AP_SKLM_21_05_BJP_MLC_PressMeet_AV_AP10139
శ్రీకాకుళం జిల్లాను మరో రాయలసీమ చెయ్యొద్దు
బాధితులకు అండగా ఉంటాం
ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అరాచకాలు చేస్తుందని ఎక్కడ చూసినా గొడవలు తప్ప ప్రశాంత వాతావరణం ఎక్కడా కనిపించడం లేదని ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా ఇలా చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా లేకపోతే కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రాయలసీమ మాదిరిగానే గొడవలు సృష్టించవద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు చేపడితే ఊరుకునేది లేదన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన వైకాపా, బిజేపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన బాధితులను ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ మంగళవారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హేయమైన చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దాడులు చేస్తే భయపడేది లేదన్నారు. బంటుపల్లిలో జరిగిన ఘటన చిన్నదిగా భావించడంలేదని దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు. రణస్థలం ఎస్.ఐ, సిఐ లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన బిజెపి కార్యకర్తలను తక్షణమే విడిపించాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో ఇదే తరహా దాడులు జరిగితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Body:బాధితులకు అండగా ఉంటాం
Conclusion:బాధితులకు అండగా ఉంటాం