ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతాప్​ను గెలిపించండి.. విజయోత్సవాలకు మళ్లీ వస్తా! - support for tdp

సినీ హీరో నిఖిల్.. కర్నూలు జిల్లా డోన్​లో తెదేపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్​షో ద్వారా ప్రజల్లోకి వెళ్లి తెదేపాను గెలిపించాలని ఓటర్లను కోరారు.

సైకిల్ కోసం నిఖిల్ ప్రచారం

By

Published : Apr 4, 2019, 5:35 PM IST

సైకిల్ కోసం నిఖిల్ ప్రచారం
కర్నూలు జిల్లాడోన్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే కొలమానంగా తెదేపా అభ్యర్థికి ఓటువేయాలని సినీ హీరో నిఖిల్.. ఓటర్లను కోరారు. డోన్​లో తెదేపా నుంచి పోటీ చేస్తున్న కేఈ ప్రతాప్​ తరఫున నిఖిల్ ప్రచారంలో పాల్గొన్నారు. బీసీ హాస్టల్​ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్​ షో చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే తెదేపానే గెలిపించాలని కోరారు.రోడ్ షో కు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. 8, 9, 10, 11 వార్డుల్లో తిరిగిన నిఖిల్.. ప్రజలను కలిశారు.మొట్టమొదటి సారిగా డోన్ లో ప్రచారంలో పాల్గొన్నానని.. కేఈ ప్రతాప్ ను గెలిపించాలని కోరారు. విజయోత్సవ సభకు మళ్లీ డోన్ కు వస్తానని నిఖిల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details