ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

srishailam project: శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 1,11,932 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయం 4గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం జలాశయం 4గేట్లు ఎత్తిన అధికారులు

By

Published : Oct 12, 2021, 7:37 AM IST

Updated : Oct 12, 2021, 9:50 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తారు. స్పిల్ వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1,29,038 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులు ఉండగా.. 214.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి అదనంగా 64,603 క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా పెరుగుతున్న వరద

ప్రకాశం బ్యారెేజీలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజి ఇన్ ఫ్లో 1,30,868 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,15,500 క్యూసెక్కులుగా ఉంది. 20 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా...మరో 50 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు 15,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:రూ.8వేల కోట్ల గంజాయ్‌.. ఆ ముఠాలదే కీలకపాత్ర

Last Updated : Oct 12, 2021, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details