కర్నూలు జిల్లా ఆదోనిలో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 సంచుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు. తక్కువ డబ్బులకు వస్తున్నాయని రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయాధికారులు.
100 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత - fake seeds seized
అరకొర వర్షాలు, విత్తన కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ నకిలీ విత్తనాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా నకిలీ విత్తనాలు కిలోలకొద్దీ మార్కెట్‌లోకి వస్తున్నాయి.
fake seeds seized