స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో మాండ్ర శివానందరెడ్డిని బరిలోకి దింపుతోంది తెలుగుదేశం. తనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఈయన... నంద్యాల నుంచే స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.