నేరచరిత్ర కలిగిన వ్యక్తి మనకు అవసరమా?
'ఇంట్లోనే వివేకా హత్య.. సాక్ష్యాలు తారుమారు' - General elections 2019
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మాచాని సోమప్ప సర్కిల్లో తెదేపా ప్రచార ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్రంపై భాజపా, వైకాపా, కేసీఆర్ కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఐపీఎస్ల బదిలీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు
వైకాపా నాయకుల తీరును చంద్రబాబు ఎండగట్టారు. నేరస్థులు రాజకీయాల్లో ఉండడం అవసరమా? అని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడూ లోటస్‌పాండ్‌లోనే ఉంటారన్నారు. ఆయన్ను శాశ్వతంగా లోటస్‌పాండ్‌లోనే ఉంచుదామని ఓటర్లకు పిలుపునిచ్చారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి, కేసీఆర్‌కు వేసినట్లేనని చెప్పారు. మరోసారి తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ఈసీకి తగదన్నారు.