కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహనందిలో ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, డీఎస్పీ చిదానంద రెడ్డి, పలు శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. బస్సు సౌకర్యం, ఆలయ దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాట్లు, తాగు నీరు, పారిశుద్ధ్యం, రథోత్సవం తదితర అంశాలపై చర్చించారు.
వచ్చే నెలలో మహానందిలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై అధికారుల సమీక్ష - మహనందిలో జరిగే బ్రహ్మోత్సవాలపై సమీక్ష
వచ్చే నెలలో ప్రముఖ పుణ్య క్షేత్రం మహానందిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలగకుండా.. ఏర్పాట్లు చేసేందుకు అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
మహనందిలో జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
TAGGED:
mahanandi samiksha