కర్నూలు జిల్లాలో 40వ నెంబర్ జాతీయ రహదారిపై బొగ్గు లోడుతో ఉన్న లారీ కాలిపోయింది. ఈ ప్రమాదంలో 30 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది ఉంటుందని అంచనావేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి నంద్యాలలోని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ... ఒక డాబా సమీపంలో ఆపి ఉంచగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
ఆళ్లగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసే లోగా లారీ దగ్ధమైంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు.