కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 29 నుంచి 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్ షిప్ (పురుషులు, మహిళలు) పోటీలు జరగనున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోటీల ఏర్పాట్లను నిర్వహకులు పరిశీలించారు.
ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 22 రాష్ట్రాలకు చెందిన 1000మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల అనంతరం ఇక్కడే జాతీయ జట్టు ఎంపిక జరగనుంది.