ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'MP RAGHURAMA : నాపై 10న ఫిర్యాదు చేశారు.. ఆయన్ను కలిశాక 11 అని చెబుతున్నారు'

By

Published : Jun 12, 2021, 10:04 AM IST

వైకాపాకు చెందిన ఎంపీలు నా పై లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ నెల 10న ఫిర్యాదు చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశాక 11న ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అందుకే పార్లమెంట్ సభ్యుడి హక్కులను పరిరక్షించాలని మరోసారి ప్రివిలైజ్ కమిటీలో పిటిషన్ దాఖలు చేస్తా. - రఘురామ కృష్ణరాజు, ఎంపీ, నరసాపురం

'MP RAGHURAMA : నాపై 10న ఫిర్యాదు చేశారు.. ఆయన్ను కలిశాక 11 అని చెబుతున్నారు'
'MP RAGHURAMA : నాపై 10న ఫిర్యాదు చేశారు.. ఆయన్ను కలిశాక 11 అని చెబుతున్నారు'

తనపై అనర్హత వేటును కోరుతూ... లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై నరసాపురం ఎంపీ రఘురామ స్పందించారు. వారు కోరినట్టుగా అనర్హత అన్నది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఏనాడూ పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అలా అని ఏ పార్టీతోనూ జతకట్టలేదని చెప్పుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో సర్కార్ లోపాలను మాత్రమే ప్రస్తావించానన్న రఘురామ.. కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని వెల్లడించారు.

మరోసారి ప్రివిలైజ్ మోషన్ వేస్తా: రఘురామ

వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలైజ్‌ మోషన్‌ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. తనపై ఈ నెల 10నే ఫిర్యాదు చేశారన్నారు. కానీ.. సీఎం జగన్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం.. ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారని ఆరోపించారు. ఇలా... అనర్హత వేటు కోరుతూ ఇప్పటికే తనపై 4, 5 సార్లు సభాపతికి ఫిర్యాదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!

ABOUT THE AUTHOR

...view details