ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 14, 2019, 7:47 PM IST

ETV Bharat / state

'తెదేపాకు ఓట్లు వేసిన పులివెందుల ప్రజలు రౌడీలా..'

మహిళలపై ఎవరు దాడికి పాల్పడినా ఉపేక్షించమని.. అటువంటి వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోనేందుకు సీఎం జగన్​ ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెదేపా హయాంలో వందల హత్యలు, అక్రమ వసూళ్లు జరిగాయని ఆరోపించారు. కృష్ణా వరద నీరు ఇంట్లోకి వస్తోందనే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

చీఫ్ విప్  శ్రీకాంత్ రెడ్డి

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్రంలో శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మహిళలపై ఎవరైనా దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడవద్దని సీఎం ఆదేశించారని తెలిపారు. గడచిన ఐదేళ్ల తెదేపా పాలనలో వందల హత్యలు జరిగాయని ఆరోపించారు. ఏ నుంచి జెడ్​ వరకూ టాక్స్‌లను నిర్ణయించి చంద్రబాబు, లోకేశ్‌ సహా తెదేపా నేతలు వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. సీఎం పులివెందుల పంచాయతీ చేస్తున్నాడని, కడప రౌడీలు అంటూ ఆ ప్రాంత ప్రజలను అవమానిస్తున్నారని అన్నారు. కడప, పులివెందులలో తెదేపాకు ఓట్లు వేసిన ప్రజలందరూ రౌడీలా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని హితవుపలికారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసేందుకు చంద్రబాబు సహా ఆయన అనుకూల ఉన్న సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానది వరదనీరు ఇంట్లోకి వస్తున్నాయనే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details