ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుజనాపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా..!' - సుజనాపై విజయసాయిరెడ్డి విమర్శలు

భాజపా ఎంపీ సుజనా చౌదరిపై.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న ఆయన.. ఇవి తప్పని భావిస్తే సుజనా విచారణకు సిద్ధమయ్యేవారని కానీ అలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. సుజనా వంటి ఆర్థిక నేరస్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సరిగా పనిచేయకపోతే అది ఆ సంస్థల మనుగడకే ముప్పని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

'సుజనాపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా..!'
'సుజనాపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నా..!'

By

Published : Dec 25, 2019, 4:36 AM IST

భాజపా ఎంపీ సుజనాచౌదరిపై తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఆయన చేసిన ఆర్థిక నేరాలేంటో పేర్కొంటూ ఇటీవలే రాష్ట్రపతికి లేఖ రాసినట్టు తెలిపారు. తాను చేసిన ఆరోపణలు తప్పని భావిస్తే.... విచారణకు సిద్ధమంటూ సుజనా ప్రకటన చేసేవారని... కానీ ఆయన అలా చేయలేదన్నారు.

దర్యాప్తు సంస్థల మనుగడకే ముప్పు

సుజనాచౌదరి వంటి ఆర్థిక నేరస్థులపై ఈడీ, సీబీఐ పనిచేయకపోతే.. అది ఆ సంస్థల మనుగడకే ముప్పు అని విజయసాయిరెడ్డి అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమంటూ సుజనా అంటున్నారని.... అది చంద్రబాబు తెరిచిన పుస్తకమన్నారు. సీబీఐ, ఈడీ విచారణకు అడ్డుకోబోనని సుజనా పత్రికా ప్రకటన చేస్తారా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

'నా ప్రతిష్ఠ దిగజార్చేందుకు.. చిల్లర ప్రయత్నం'

ABOUT THE AUTHOR

...view details