మాస్కుల పేరుతో వైకాపా ప్రభుత్వం మరో కుంభకోణం చేద్దామనుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. 5 కోట్ల మందికి 3 చొప్పున 15 కోట్ల మాస్కులు కావాలన్న బుద్దా వెంకన్న.... ఇప్పటి వరకు ఎవరికైనా, ఎక్కడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మొన్న కరోనా టెస్టింగ్ కిట్లు, నేడు మాస్కులతో కరోనా కాలంలోనూ వైకాపా ప్రభుత్వం అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం... తొలగించాలని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మందు' కాదు... ముందు అన్నం పెట్టండి!
తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతలు తమ మద్యం కంపెనీలను తెరుచుకుంటున్నారని బుద్ధా ధ్వజమెత్తారు. కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా అని నిలదీశారు. ఆరోగ్య సర్వేను జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారన్న బుద్ధా.... ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిలదీశారు.