జూనోసిస్ డే అంటే.... కుక్కలకోసం ప్రత్యేకించిన రోజు. లూయీస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1985లో యాంటీ రేబిస్ వ్యాక్సిన కనిపెట్టిన రోజునే జూనోసిస్ డే అంటూ ఏటా జులై 6న నిర్వహిస్తున్నారు. కుక్క ఎవరినైనా కరిస్తే వారికి రేబిస్ అనే వ్యాధి సోకుతుంది. కుక్కలకు టీకాలు వేయడం వల్ల... వాటి నుంచి రేబిస్ వ్యాధి ఇతర జీవాలకు, జనానికి సోకకుండా ఉంటుంది. అందుకే ఏటా జూనోసిస్ డే రోజున పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేస్తుంటారు.
మీ ఇంట్లో కుక్క ఉందా?... తస్మాత్ జాగ్రత్త!
పెంపుడు జంతువులు ఎంత మురపెంగా ఉంటాయో వాటితో అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. సరైన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించకపోతే... అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వాటి వల్లే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. వీటిపై అవగాహన కల్పించడానికే ప్రతి యేటా జూనోసిస్ డే నిర్వహిస్తున్నారు.
జంతువుల ద్వారా 200 నుంచి 250 రకాల వరకు వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. వీటిలో ప్రాణాంతకమైన రేబిస్ కుక్కల ద్వారా మనుషులకు, పశువులకు సంక్రమిస్తుంది. ఆ వ్యాధి సోకిన పశువు, మనిషి మెదడులో వైరస్ స్థిర నివాసం ఏర్పరుచుకుని, పిచ్చి లక్షణాలు కలగచేస్తాయి. అందుకే కుక్కలతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఉంటారు నిపుణులు. జీవసంబంధ వ్యాధులు మన పెంపుడు జంతువులకు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలంటున్నారు.జూనోసిస్ డే సందర్భంగా విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆసుపత్రిలో... కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంతుప్రేమికులుఉదయం నుంచే ఆసుపత్రుల వద్ద బారులు తీరారు. వివిధ జాతులకు చెందిన కుక్కలను తీసుకొచ్చి టీకాలు వేయిస్తున్నారు.