కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. తిరులగిరి నుంచి మంగొల్లు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన అర్ధనగ్నంగా పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని చిలుకూరు మండలం దుదియతాండకు చెందిన మళ్లొత్తు విజయబాలగా పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయి మూడేళ్లుగా జగ్గయ్యపేట శాంతినగర్లో నివసిస్తోందని తెలిపారు. వినాయక విగ్రహాలు తయారుచేసే వారి వద్ద పనిచేస్తోందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామూలు మరణమా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా? అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మృతదేహం లభ్యం- హత్యా? ఆత్మహత్యా? - మంగొల్లు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో అనుమానాస్పదస్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని చిలుకూరు మండలం దుదియతాండకు చెందిన మళ్లొత్తు విజయబాలగా పోలీసులు గుర్తించారు.
మహిళ మృతదేహం లభ్యం- హత్యా? ఆత్మహత్యా?