కేంద్రం తాజాగా అన్ లాక్-3 లో కొన్ని ఆంక్షలను సడలించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో మందుబాబులు క్యూ కట్టారు. సామాజిక దూరం పాటించకుండా బారులు తీరి మద్యం దుకాణం ముందు నిల్చున్నారు. గతంలో జిల్లాలో పలుచోట్ల మద్యం దుకాణాలు తెరిచినప్పటికీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం అధికారులు అనుమతినివ్వలేదు. దీంతో నగర శివార్లలోని దుకాణాల్లో మద్యం కొనుగోలు చేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో దుకాణాలు తెరుచుకోవటంతో ఉదయం 8గంటల నుంచే దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కరోనా సమయంలో మాస్క్లు ధరించటం, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలు గాలికి వదిలేశారు.
'మేము మందుబాబులం... మాకు భౌతిక దూరం ఉండదు'
రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్న మందుబాబుల్లో మాత్రం చలనం లేదు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలు ఆడుతున్నారు. పలు మద్యం దుకాణాల వద్ద వారి రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా క్యూలైన్లు వదిలి గుంపుగుంపులుగా కోనుగోళ్లు చేస్తున్నారు. మాస్కులు లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై తిరుగుతున్నారు.
" మద్యం ప్రియులకు భౌతికదూరం, మాస్క్లు ఉండవు"
ఇవీ చదవండి