ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2021, 1:40 PM IST

ETV Bharat / state

ఊర్లోకి రానివ్వకపోవడంతో పొలమే ఆమెకు ఐసోలేషన్​

కొవిడ్ సోకిన ఓ విద్యార్థినిని గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చేసేదేం లేక ఊరి చివరనున్న వారి పొలంలోనే ఆమె ఐసొలేషన్‌లో ఉంటోంది. క్వారంటైన్​ పూర్తయిన తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తామని పంచాయతీ పెద్దలు స్పష్టం చేశారు.

ఊర్లోకి రానివ్వకపోవడంతో పొలమే ఆమెకు ఐసోలేషన్​
ఊర్లోకి రానివ్వకపోవడంతో పొలమే ఆమెకు ఐసోలేషన్​

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఇంటర్‌ చదువుతూ కొవిడ్‌ బారిన పడింది. గ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్థులు ఊళ్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక ఊరి చివరనున్న తమ పొలంలోనే ఆమె ఐసొలేషన్‌లో ఉంటూ రాత్రుళ్లు చిమ్మ చీకట్లో గడుపుతోంది.

మరో 4 రోజులు గడిస్తేనే..

ఏటీడబ్ల్యూఓ క్రాంతికుమార్‌, గురుకులం ఆర్‌సీఓ గంగాధర్‌ ఆమెను సోమవారం పరామర్శించారు. గ్రామంలోకి బాలికను అనుమతించాలని పంచాయతీ పెద్దలతో రాత్రి ఎనిమిది గంటల వరకు చర్చించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో నాలుగు రోజులు గడిస్తే క్వారంటైన్‌ పూర్తవుతుందని, అప్పుడే గ్రామంలోకి అడుగు పెట్టనిస్తామని తెగేసి చెప్పడంతో ఆ యువతి పొలంలోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి :విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్

ABOUT THE AUTHOR

...view details