గ్రామ సచివాలయ నియామకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల కానుందని చెప్పారు. 13 శాఖల్లో 11రకాల ఉద్యోగాలకు ఈ వారంలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. అభ్యర్థుల వయో పరిమితి, పోస్టుల సంఖ్య, సిలబస్‌ని వీలైనంత త్వరగా ఖరారు చేస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ సచివాలయాలు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు.దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సూచించారు.
అక్టోబర్ 2 నాటికి అందుబాటులోకి గ్రామ సచివాలయాలు - vilage secritariate posts notification realese soon
అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. దీనికి సంబంధించి వారంరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో త్వరలోనే కొలువుల జాతర
TAGGED:
dwivedi