కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో స్కిల్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌లో యువతీయువకులు రూపొందించిన వివిధ కళా ఖండాలు, వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశం అభివృద్ధి చెందాలంటే చక్కటి సంస్కరణలు తీసుకోవాల్సి ఉందని... ప్రస్తుతం దేశంలో అదే జరుగుతుందన్నారు. విద్య కేవలం ఉద్యోగానికే కాకుండా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఏ దేశంలో లేని యువశక్తి.... మన దేశంలో ఉందన్నారు.
'దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది'
ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో నిర్వహించిన స్కిల్ ఇండియా కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్ పాల్గొన్నారు. యువతీ యువకులు రూపొందించిన వివిధ స్టాల్స్‌ను తిలకించారు. దేశాభివృద్ధికి చక్కటి సంస్కరణలు తీసుకోవాల్సి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది: ఉపరాష్ట్రపతి
గవర్నర్ ఏమన్నారంటే...
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని గవర్నర్ పేర్కొన్నారు. యువకులు నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించి...ఈ రాష్ట్రాన్ని... ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువకులకు నైపుణ్య అభివృద్ధిపై స్వర్ణభారత్ ట్రస్టు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.