ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు.. చామంతి, సంపెంగలతో పూజలు

వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా జగన్మాత దుర్గమ్మకు.. పుష్పార్చన కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. పసుపు చామంతి, సంపెంగ పుష్పాలతో అర్చన చేశారు. తొమ్మిదో రోజు రేపు కనకాంబరాలు, ఎర్ర గులాబీ పూలతో అమ్మవారికి అర్చన జరపనున్నారు.

vasantha navaratri
చామంతి, సంపెంగలతో దుర్గమ్మకు పూజలు

By

Published : Apr 20, 2021, 10:03 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కన్నుల పండువగా పుష్పార్చన జరుగుతోంది. వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా జగన్మాత దుర్గమ్మకు పసుపు చామంతి, సంపెంగ పుష్పాలతో అర్చన చేశారు. అమ్మవారి మూలవిరాట్‌ వద్ద ఈ పుష్పాలను ఉంచి పూజలు చేసిన అనంతరం.. సంప్రదాయబద్ధంగా ఉభయదాతలు, సేవా సంస్థల సభ్యులు ఉత్సవ మూర్తి వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారికి వాటితో పుష్పార్చన చేసి.. లలిత సహస్ర నామ పారాయణం చేశారు.

అనంతరం అమ్మవారికి ఓంకార, నాగ, సింహ, కుంభ, నక్షత్ర హారతులను సమర్పించారు. అర్చనలో పాల్గొన్న ఉభయదాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి.. రక్ష కంకణం, శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

రేపు తొమ్మిదో రోజు అమ్మవారికి కనకాంబరాలు, ఎర్ర గులాబీ పూలతో అర్చన జరగనుంది. పుష్పార్చనలో పాల్గొనదలచినవారు.. కొండపైన చిన్న రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన.. పుష్పార్చన మండపం వద్ద ఉదయం ఎనిమిది గంటలలోపు పుష్పాలను సమర్పించాలని దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు. పుష్పార్చన సేవలో పాల్గొనేందుకు 2,500 రూపాయలు దేవస్థానం ఆర్జిత సేవ కౌంటర్​లో చెల్లించాలని సూచించారు.

ఇవీ చూడండి...

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: జనసేన అధికార ప్రతినిధి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details