ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వికారి నామ సంవత్సర వేడుకలు - రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి.

వైభవంగా ఉగాది వేడుకలు

By

Published : Apr 6, 2019, 6:00 PM IST

ఘనంగా ఉగాది వేడుకలు

రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, దేవాదాయశాఖ కమిషనర్ ఎం.పద్మ, ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకట పూర్ణ సిద్ధాంతి పంచాంగాన్ని పఠించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం, వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను అతిధులు లాంఛనంగా ఆవిష్కరించారు. ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ ప్రజాస్వామ్యంలో ఓటు మన అభివృద్ధికి భరోసా వంటిదంటూ ఓ కవిత చదివి వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details