కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో తెదేపా కార్యకర్త కొండపనేని నాగేశ్వరరావుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. తాను ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందించి ట్రాక్టర్లను పట్టిస్తున్నారన్న కోపంతోనే... సూర్యదేవర రాము, తేళ్ల లోకేశ్ అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. ఘటనలో నాగేశ్వరరావుకు తీవ్రగాయాలు కాగా... నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తెదేపా కార్యకర్తపై ఇసుక మాఫియా దాడి - తంగిరాల సౌమ్య వార్తలు
ఇసుక అక్రమ రవాణాపై పోలీసులుకు సమాచారమిస్తున్నాడనే కారణంతో తెదేపాకు చెందిన ఓ కార్యకర్తపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు