దసరా నవరాత్రుల దృష్ట్యా కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. మూలా నక్షత్రం కావటంతో దుర్గగుడి వద్ద భక్తుల రద్దీ పెరిగింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోని గట్టు వెనుక ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. సితార కూడలి నుంచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు.
దుర్గ గుడికి పెరిగిన రద్దీ..స్తంభించిన ట్రాఫిక్
దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా... విజయవాడ నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
విజయవాడలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్