ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు ప్రముఖులకు 'మండలి' స్మారక పురస్కారాలు - మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి కార్యక్రమం వార్తలు

దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు 23వ వర్ధంతి సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలందించిన వారిని గాంధీ క్షేత్రం కమిటీ ఘనంగా సత్కరించింది. ముగ్గురికి మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలు అందజేసింది.

‘Council’ Memorial Awards to
‘Council’ Memorial Awards to

By

Published : Sep 27, 2020, 6:16 PM IST

సంస్కృతితో పాటు దివిసీమ ప్రాంతాన్ని స్థానికులు కాపాడుకోవాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఓఎన్​జీసీ చేపట్టే తవ్వకాలతో వచ్చే అనర్ధాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆయన అధ్యక్షతన దివంగత మాజీ మంత్రి, దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు 23వ వర్ధంతి కార్యక్రమం కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీక్షేత్రంలో ఆదివారం జరిగింది. కృష్ణా డెల్టా పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు అక్కినేని భవానీ ప్రసాద్​కు, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డికి, నాట్యాచార్యులు కేవీ సత్యన్నారాయణకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలు అందచేశారు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం కృష్ణా నదిలో నిరంతర ప్రవాహం ఉండేలా సాలీనా 18 టీఎంసీల నీటిని కేటాయించిందని అక్కినేని భవానీ ప్రసాద్ వెల్లడించారు. ఆ నివేదిక అమలులోకి వస్తే సముద్రంలోకి నిరంతారాయ నీటి సరఫరా జరిగి ఉప్పు నీరు ఎగువకు చొచ్చుకు వచ్చే ప్రమాదం తప్పుతుందన్నారు. అలాగే ఓఎన్​జీసీ దివి ప్రాంతంలో జరుపుతున్న గ్యాస్ వెలికితీత విషయంలోనూ... వ్యవసాయ భూములు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయో గుర్తించి బెంచ్ మార్క్ ఏర్పాటు చేయాలని భవానీ ప్రసాద్ సూచించారు. లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతాలు ఇక్కడా వచ్చే అవకాశముందన్నారు.

మరోవైపు... దివి ప్రాంతంలోని చారిత్రిక, ఇతిహాసిక విశేషాలను, ముఖ్య ఘట్టాలను చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వివరించారు. నాగాయలంక , మోపిదేవి, హంసలదీవి, కోడూరు, ఘంటసాల లాంటి ప్రదేశాలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. దివిసీమలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, అద్భుత ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం 'భారత దేశంలో కరవు కాటకాలు', 'మానవతామూర్తి మండలి' పుస్తకాలు ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details