కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి వంతెన సెంటర్లో మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టణానికి చెందిన భూపతి అన్వేష్, భూపతి రేణుకయ్య, భూపతి అజయ్ కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మోదుమూడి బస్‌షెల్టర్ వద్ద ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి వారిన అదుపులోకి డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ఈ నెల 14వ తేదీన మద్యం మత్తులో తామే ఈ చర్యకు పాల్పడినట్లు విచారణలో నిందితులు తెలిపారని డీఎస్పీ చెప్పారు.
విగ్రహం ధ్వంసం కేసు..ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు - avanigadda latest news
దివంగత నేత మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అవనిగడ్డ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మద్యం మత్తులో విగ్రహం ధ్వంసం చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు