ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి - దిశా కేసుకు నిరసనగా రాష్ట్రంలో ప్రజా, విద్యార్థి సంఘాలు ప్రదర్శనలు

దిశ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ... ప్రజా,విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ర్యాలీలు చేశారు. దోషులను ఉరితీస్తేనే ఇలాంటి సంఘటనలు ఆగుతాయని నినదించారు.

హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి
హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి

By

Published : Dec 3, 2019, 4:26 AM IST

దిశ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలో ప్రజా, విద్యార్థి సంఘాలు ప్రదర్శనలు నిర్వహించాయి. కాకినాడలో ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి కూడలి వరకూ కళాశాల విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంత్రి కన్నబాబు, జిల్లా ఎస్పీ నయీం అస్మి దిశకు నివాళులర్పించారు. మృగాళ్ల క్రూరత్వానికి నిరసనగా హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నందిగామలో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. మైలవరంలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ మహిళలపై దాడుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హంతకులను బహిరంగంగా ఉరి తీయాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల, మడకశిరల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాయదుర్గంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి సమీప బైరాగిపట్టెడ నుంచి అన్నమయ్య కూడలి వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

హోరెత్తిన ప్రజా,విద్యార్థి సంఘాలు.... దిశాకు న్యాయం చేయాలి

ABOUT THE AUTHOR

...view details