ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2019, 8:47 PM IST

ETV Bharat / state

''రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది''

వ్యవసాయాన్ని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్. యలమంచిలి శివాజీ.. క్రాప్‌హాలిడే పేరిట రచించిన పుస్తకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు.

క్రాప్‌హాలిడే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌

క్రాప్‌హాలిడే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ పొగాకు రైతు ఉద్యమ చరిత్రపై... క్రాప్‌హాలిడే పేరిట రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్. యలమంచిలి శివాజీ రచించిన పుస్తకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు ఈ పుస్తకాన్ని ముద్రించారు. పొగాకు రైతుల స్థితిగతులు - నాటి పరిస్థితులు - పోరాటాలు... ప్రభుత్వాల చర్యలను సమగ్రంగా వివరిస్తూ డాక్టర్. శివాజీ క్రాప్‌హాలిడే పుస్తకం రచించినందుకు గవర్నర్‌ ప్రశంసించారు. పంట విరామం ప్రకటించి చేసిన పోరాటం ద్వారా అనేక పంటలకు మద్దతు ధర ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. పొగాకు పంట పండించిన రైతుల పరిస్థితి ఎన్నేళ్లు అవుతున్నా మార్పు లేదని- పుస్తక రచయిత శివాజీ అభిప్రాయపడ్డారు. పరిమిత పంట విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తోన్న పొగాకుకు.. మంచి ధర వచ్చేలా- నాణ్యత నుంచి ఉత్పాదకాల వరకు బోర్డు అన్ని విధాలా అండగా నిలుస్తోందని- పొగాకు బోర్డు కార్యదర్శి అద్దంకి శ్రీధర్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details