ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెంపు

మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) పరిధిని విస్తరిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 2503.12 చదరపు కిలోమీటర్లకు పరిధిని పెంచింది. 12 మండలాలను దీని పరిధిలోకి తీసుకొచ్చింది.

Machilipatnam Urban Development Authority
మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి పెంపు

By

Published : Jun 8, 2020, 10:15 PM IST

మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2076.96 చదరపు కిలోమీటర్ల మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 28 గ్రామాల పరిధిలో 426.16 చదరపు కిలోమీటర్లలో ముడా పరిధి ఉంది. బందరు కార్పొరేషన్, మచిలీపట్నం, పెడన మండలాల్లో ముడా పరిధి విస్తరించి ఉండేది. ఈ క్రమంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి 2503.12 చదరపు కిలోమీటర్లకు చేరింది.

ప్రభుత్వం తాజాగా 12 మండలాల పరిధిలో 242 గ్రామాలను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి తెచ్చింది. కొత్తగా పెడన సహా 12 మండలాల్లోని కొన్ని గ్రామాలు పరిధిలో చేరాయి.గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, కైకలూరు, కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ పరిధిలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details