ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యగ్రహణం... రాష్ట్రంలోని ఆలయాలు మూసివేత - సూర్యగ్రహణం కారణంగా ఆలయాలు మూసివేత

సూర్యగ్రహణ కారణంగా బుధవారం రాత్రి 9 గంటల నుంచి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడలోని దుర్గదేవి గుడిని ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు మూసివేశారు. తిరిగి మళ్లీ ఇవాళ 2 గంటల తరువాత ఆలయాలన్నింటినీ శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

temples are closed due to solar eclipse in thirupathi and vijayawada
సూర్యగ్రహణ కారణంగా తిరుపతి, ఇంద్రకీలాద్రి ఆలయాలు మూసివేత

By

Published : Dec 26, 2019, 12:04 AM IST

Updated : Dec 26, 2019, 5:07 AM IST

సూర్యగ్రహణ కారణంగా తిరుపతి, ఇంద్రకీలాద్రి ఆలయాలు మూసివేత

సూర్యగ్రహణం కారణంగా తిరుపతిలోని పలు ఆలయాలను తితిదే అధికారులు మూసివేశారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరామ స్వామి, శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలను మూసివేశారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాల తలుపులు మూసి ఉంచుతామని అర్చకులు తెలిపారు. గ్రహణ అనంతరం ఆలయ తలుపులు తెరిచి శుద్ది, పుణ్యాహవచనం నిర్వహించి భక్తులకు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆలయాల దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గ అమ్మవారి గుడి అంతరాలయం, ప్రధాన ద్వారాలను పూజారులు, అధికారులు మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసరావు పూజలు నిర్వహించి ఆలయాన్ని శాస్త్రోక్తంగా మూసివేశారు. దుర్గగుడిలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాయంత్రం స్నాపనాభిషేకం అనంతరం ఆలయంలోకి భక్తుల అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో సురేష్‌ కుమార్‌, అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రజల సందర్శనకు జగన్, వాసు..!

Last Updated : Dec 26, 2019, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details