తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో ఐదు తెల్ల పులిపిల్లలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ నెల మెుత్తం అమ్మ చాటునున్న పులి పిల్లలను బుధవారం నుంచి సందర్శనలో ఉంచారు. పులిపిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ... సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ 8 నెలల 5 పులి పిల్లలు ఇన్నాళ్లు తల్లిచాటున ఉన్నాయి. వీటికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... జగన్, వాసు, సిద్దాన్, విజయ, దుర్గ అని నామకరణం చేశారు.
ఇవీ చదవండి...తిరుపతిలో 5 తెల్లపులి పిల్లల జననం..వాటి పేర్లేంటో తెలుసా